Police: 'కాంచన 3' నటికి వేధింపులు... నటుడు రుబేశ్ కుమార్ అరెస్ట్!

  • రష్యా నుంచి వచ్చి చెన్నైలో స్థిరపడ్డ నటి
  • అవకాశాల పేరిట వేధించిన రుబేశ్
  • కేసును విచారిస్తున్న పోలీసులు
ఇటీవల విడుదలైన లారెన్స్ హారర్ చిత్రం 'కాంచన-3'లో నటించిన రష్యన్ నటిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై నటుడు రుబేశ్ కుమార్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, రష్యాకు చెందిన నటి, తన భర్త, పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం చెన్నైకి వచ్చి, ఎంఆర్‌సీ నగర్‌ లో నివాసం ఏర్పరచుకుంది.

తరచూ వాణిజ్య ప్రకటనలలోను, సినిమాల్లోనూ చేస్తోంది. లారెన్స్‌ నటించి, తెరకెక్కించిన 'కాంచన 3' లోనూ నటించింది. గతంలో తనతో పాటు పలు వ్యాపార ప్రకటనల్లో నటించిన రుబేశ్ కుమార్, అవకాశాల పేరు చెప్పి, పలు భంగిమల్లో ఫోటోలు తీశాడని, ఆపై వాటిని తన వాట్స్ యాప్ కు పంపుతూ, కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని, కోరిక తీర్చకుంటే, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ, పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన సైబర్ క్రైమ్ సీఐ దురై, దర్యాఫ్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
Police
Kanchana-3
Arrest
Rubesh Kumar
Actress

More Telugu News