30 ఏళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు జమున
- సెట్స్ పైకి దేవినేని నెహ్రు బయోపిక్
- ప్రధానమైన పాత్రలో తారకరత్న
- ప్రత్యేకమైన పాత్రలో జమున
ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ .. "దర్శకుడు శివనాగు నాకు దత్తపుత్రుడు లాంటివాడు. ఈ సినిమాలో నేను తప్పకుండా చేయవలసిందేనని ఆయన పట్టుబట్టడంతో కాదనలేకపోయాను. ఆయన వినయ విధేయతలు .. క్రమశిక్షణ నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి మరో కారణం. 30 ఏళ్ల తరువాత మళ్లీ నాతో మేకప్ వేయించిన ఘనత శివనాగుకే చెందుతుంది. ప్రధానమైన పాత్రను పోషిస్తున్న తారకరత్నకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.