Telangana: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు!

  • దరఖాస్తు చేయకున్నా రీ వెరిఫికేషన్
  • కట్టిన డబ్బులు వెనక్కిచ్చేస్తాం
  • 15 లోపు కొత్త ఫలితాల వెల్లడి

ఇంటర్మీడియట్‌ మూల్యాంకనం అనంతరం ఏర్పడిన గందరగోళంపై సమీక్ష జరిపిన తెలంగాణ సీఎం, ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఇంటర్ బోర్డు మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

ఉత్తీర్ణత సాధించని వారు దరఖాస్తు చేసుకోకున్నా ఫర్వాలేదని, అందరికీ రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ చేస్తామని వెల్లడించింది. ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నగదును తిరిగి చెల్లించనున్నట్టు పేర్కొంది. రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ కోసం ఇంటర్‌ నెట్‌ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మే 15 లోపు కొత్త ఫలితాలను, కొత్త మార్కులను  విద్యార్థుల ఇంటికి పంపుతామని తెలిపింది.

  • Loading...

More Telugu News