Jagan: జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు డిశ్చార్జ్!

  • జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు
  • టైఫాయిడ్ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స
  • తిరిగి సెంట్రల్ జైలుకు తరలింపు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడికి దిగిన నిందితుడు శ్రీనివాసరావు రెండు రోజుల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నిందితునికి జ్వరం రావడంతో, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా, వైద్యులు టైఫాయిడ్ సోకిందని తేల్చి చికిత్స చేశారు.

మరో ఐదు రోజుల తరువాత మరోసారి పరీక్షిస్తామని చెప్పిన వైద్యులు, శ్రీనివాసరావును డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్పడంతో, పోలీసులు అతన్ని తిరిగి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో ఉన్న సమయంలో శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు తదితరులు అతన్ని పరామర్శించి వెళ్లినట్టు తెలుస్తోంది.

More Telugu News