Telangana: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘జనసేన’ సింబల్ మార్పు

  • జెడ్పీ టీసీ ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తే 
  • ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం పార్టీ గుర్తు ‘క్రికెట్ బ్యాట్’
  • ఈ మార్పును ఓటర్లు గమనించాలి: జనసేన
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ సింబల్ కు సంబంధించి ఒక మార్పు జరిగింది. జెడ్పీ టీసీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తునే కేటాయించినప్పటికీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం ‘క్రికెట్ బ్యాట్’ గుర్తును ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ మార్పును ఓటర్లు, పార్టీ శ్రేణులు గమనించాలని జనసేన తెలంగాణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు జనసేన ఓ ట్వీట్ చేసింది. కాగా, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మూడు విడతలలో జరగనున్నాయి. మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, మే 27న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 
Telangana
Jana sena
symbol
mptc
cricket bat

More Telugu News