TTD: టీటీడీ బంగారం తరలింపులో లోపాలున్న మాట నిజమే!: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

  • చంద్రబాబు ఆమోదం కోసం నివేదికను పంపా
  • బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయి
  • సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి?
తిరుమల తిరుపతి దేవస్థానం వారి బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలున్న మాట వాస్తవమేనని, టీటీడీ అధికారులు అంత అజాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది కాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ బంగారం తరలింపునకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం కోసం పంపామని ఆయన తెలిపారు.

శ్రీవారి బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటాయని సీఎస్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలన్నారు. తానొక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.
TTD
Gold
LV Subrahmanyam
EC
Election code
Chandrababu

More Telugu News