kalayan ram: సోషియో ఫాంటసీ నేపథ్యంలో 'తుగ్లక్' .. వచ్చేనెలలో సెట్స్ పైకి

  • '118'తో హిట్ కొట్టిన కల్యాణ్ రామ్ 
  • ముగింపు దిశగా ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • త్వరలోనే కథానాయికల ఎంపిక   

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన '118' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. తన తదుపరి సినిమాను ఆయన వేణు మల్లిడి దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

ఈ సినిమాను కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో చేయడం ఒక విశేషమైతే, ద్విపాత్రాభినయం చేయనుండటం మరో విశేషం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకాచకా జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును కూడా మొదలెట్టనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం వుంది. కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే కథానాయికల పేర్లను ప్రకటించనున్నారు.

More Telugu News