nani: 'గ్యాంగ్ లీడర్' కోసం రెడీ అవుతోన్న మేఘా ఆకాశ్

  • షూటింగు దశలో 'గ్యాంగ్ లీడర్'
  • నాని సరసన నాయికగా మేఘా ఆకాశ్
  • ప్రియాంక అరుళ్ తొలి పరిచయం  

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని కథానాయకుడిగా 'గ్యాంగ్ లీడర్' రూపొందుతోంది. ఆల్రెడీ ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో మొదలుకానున్న ఈ షెడ్యూల్లో మేఘా ఆకాశ్ జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఆమె నటిస్తోంది.

నితిన్ తో చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో వెనుకబడిపోయిన ఈ అమ్మాయి, నాని సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తన కెరియర్ ఊపందుకుంటుందని ఆశపడుతోంది. ఈ సినిమాతో ఈ అమ్మాయి ఆశ నెరవేరుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ నటిస్తోంది. తెలుగులో ఈ అమ్మాయి తొలి సినిమా ఇదే. 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనుండటం విశేషం.

More Telugu News