nani: నాని తదుపరి సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

  • 'జెర్సీ'తో హిట్ కొట్టిన నాని 
  • విక్రమ్ కుమార్ తో 'గ్యాంగ్ లీడర్'
  • తదుపరి సినిమాకి సన్నాహాలు      

నాని కథానాయకుడిగా ఇటీవల థియేటర్లకు వచ్చిన 'జెర్సీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విక్రమ్ కుమార్ తో 'గ్యాంగ్ లీడర్' చేస్తున్న ఆయన, ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేయనున్న సినిమాపై కూడా దృష్టిపెట్టాడు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటించనున్నాడు.

ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ వేరే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. సినిమాను లాంచ్ చేసిన రోజునే టైటిల్ లోగోతో కూడిన ఫస్టులుక్ ను వదిలే ఆలోచనలో వున్నారని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన అదితీరావు .. సుధీర్ బాబు జోడీగా నివేదా థామస్ నటించనున్నారు. 

More Telugu News