Andhra Pradesh: దేశప్రగతికి పట్టుగొమ్మలైన పల్లెల బాగు కోసం ప్రతీఒక్కరం కృషిచేద్దాం!: నారా లోకేశ్

  • నేడు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 
  • గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దామని పిలుపు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నేపథ్యంలో ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు.  దేశ ప్రగతికి పట్టుగొమ్మలాంటి పల్లెల బాగు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధిద్దామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ.. ‘ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. దేశ ప్రగతికి పట్టుకొమ్మలాంటి పల్లెల బాగు కోసం ప్రతి ఒక్కరూ కృషిచేద్దాం. గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించుదాం’ అని ట్వీట్ చేశారు. దీనికి NationalPanchayatiRajDay అనే ట్యాగ్ ను జతచేశారు.
Andhra Pradesh
national panchayat raj day
Nara Lokesh
Telugudesam
Twitter

More Telugu News