Andhra Pradesh: అమరావతి పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జయంతిని నిర్వహించండి!: జాస్తి వీరాంజనేయులు

  • అమరావతి అభివృద్ధి కమిటీ చీఫ్ విజ్ఞప్తి
  •  సీఎస్, సీఆర్డీఏ కమిషనర్ తో భేటీ
  • సానుకూలంగా స్పందించిన అధికారులు
అమరావతిని పాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జయంతిని అధికారికంగా నిర్వహించాలని అమరావతి  అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ను ఈరోజు ఆయన కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని పేరు నిర్ణయించిన చంద్రబాబు, ఈ విషయంలో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏటా ఏప్రిల్ 27న రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి జయంతి వేడుకలను నిర్వహించాలని కోరారు. కాగా, ఈ విషయమై ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున వెంటనే నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. ఏపీ భాషా, సాంస్కృతిక శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Andhra Pradesh
amaravati
vasireddy vankatadri naidu
jayanthi
cs
crda

More Telugu News