atlee kumar: దర్శకుడు అట్లీ కుమార్ పై మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

  • మంచి భోజనం కావాలని అడిగాము 
  • టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయించమన్నాం
  • ఆయన మమ్మల్ని మనుషుల్లా చూడలేదు 
విజయ్ కథానాయకుడిగా 'తెరి' .. 'మెర్సల్' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన అట్లీ కుమార్, కోలీవుడ్లో అగ్రస్థాయి దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. ప్రస్తుతం ఆయన విజయ్ కథానాయకుడిగా మరో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగు సమయంలో మహిళా జూనియర్ ఆర్టిస్టుల పట్ల ఆయన చాలా అవమానకరంగా వ్యవహరించాడంటూ ఒక మహిళా జూనియర్ ఆర్టిస్ట్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

ఈ నెల 13వ తేదీన షూటింగులో మంచి భోజనం గురించి .. టాయిలెట్ సౌకర్యం గురించి అట్లీ కుమార్ ను అడిగినందుకు ఆయన రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడని చెప్పింది. మహిళా ఆర్టిస్టులుగా కాదు గదా .. కనీసం మనుషుల్లా కూడా తమని ఆయన చూడటం లేదని వాపోయింది. ఆ రోజునే ఫిర్యాదు చేయాలనుకున్నామనీ, అయితే పోలీసులంతా ఎన్నికల హడావిడిలో ఉండటం వలన ఆగిపోయామని అంది. ఇకపై మహిళా జూనియర్ ఆర్టిస్టుల పట్ల అట్లీ ఇలా వ్యవహరించకుండా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంపై అట్లీ కుమార్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
atlee kumar

More Telugu News