nani: నాని సత్తాను మరోసారి నిరూపించిన 'జెర్సీ'

  • తెలుగు రాష్ట్రాల్లో 'జెర్సీ' జోరు
  •  ఓవర్సీస్ లోను అదే తీరు 
  • శ్రద్ధా శ్రీనాథ్ కి పెరగనున్న అవకాశాలు     

తెలుగు తెరపై సహజనటుడిగా నానీకి మంచి పేరు వుంది. ఆయన ఒక కథను ఒప్పుకున్నాడు అంటే, అందులో తప్పకుండా విషయం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వుంది. అలాంటి నమ్మకంతోనే 'జెర్సీ' సినిమాకి వచ్చిన ప్రేక్షకులు, ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఆడియన్స్ ను ఎమోషనల్ గా టచ్ చేసింది. ఈ కారణంగానే అన్ని ప్రాంతాల్లోను భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. 5 రోజుల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా 1 మిలియన్ మార్కును క్రాస్ చేసింది. ఓవర్సీస్ లో నాని ఈ ఫీట్ ను సాధించడం ఇది ఆరోసారి. ఫుల్ రన్ లో ఈ సినిమా 2 మిలియన్ మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సక్సెస్ కారణంగా శ్రద్ధా శ్రీనాథ్ కి ఇక్కడ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి నాని ఖాతాలో మరో భారీ హిట్ చేరిపోయింది. 

More Telugu News