jacqeline fernandez: రాజమౌళి సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండజ్?

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • ఒక నాయికగా అలియా భట్ 
  • రెండవ నాయికగా పరిణితీ చోప్రా?

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా అలియా భట్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని అలియా భట్ కూడా ధ్రువీకరించింది. చరణ్ జోడీగా ఆమె కనిపించనుంది. ఇక ఎన్టీఆర్ సరసన నాయికగా పరిణితీ చోప్రా పేరు వినిపిస్తోంది. ఆమె ఎంపిక విషయంలో స్పష్టత రావలసి వుంది.

ఈ నేపథ్యంలోనే జాక్విలిన్ ఫెర్నాండజ్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెను సల్మాన్ ఖాన్ సిఫార్స్ చేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అయితే హీరోయిన్ పాత్రకా? లేదంటే మరేదైనా పాత్రకా? అనే విషయం తెలియాల్సి వుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.

More Telugu News