Andhra Pradesh: వైసీపీ నేతలది రాక్షసానందం: వేమూరి ఆనంద్ సూర్య

  • టీటీడీ పవిత్రత దెబ్బతీసే కుట్ర
  • బంగారం తరలింపు బ్యాంకు బాధ్యతే
  • కేంద్రం కుట్రలో వైసీపీ ఓ పావు
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య టీటీడీ బంగారం విషయంలో స్పందించారు. తిరుమల వెంకన్న బంగారం తరలింపులో ఏపీ ప్రభుత్వం, టీటీడీలకు సంబంధం ఉందంటూ  వైసీపీ ఆరోపణలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి బంగారం తరలింపు బాధ్యత బ్యాంకు అధికారులదేనని, వాళ్లు నిర్లక్ష్యం చూపితే దానికి టీటీడీని, ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో వైసీపీ రాక్షసానందం పొందుతోందని అన్నారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం ఆడిస్తున్న కుట్రలో వైసీపీ ఓ పావు మాత్రమేనని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
TTD

More Telugu News