Hyderabad: విద్యార్థిని ఫిర్యాదుతో ‘సూత్రధారి’ యాక్టింగ్ స్కూల్ డైరెక్టర్ అరెస్టు

  • వినయ్ వర్మపై విద్యార్థిని అచింత కౌర్ చద్దా ఫిర్యాదు
  • ఫిర్యాదు మేరకు వినయ్ వర్మపై నిర్భయ కేసు
  • కేసు విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టులో హాజరు

నటన నేర్పాలంటే ఒంటిపై బట్టలన్నీ విప్పాలని ‘సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్’   డైరెక్టర్ వినయ్ వర్మపై విద్యార్థిని అచింత కౌర్ చద్దా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినయ్ వర్మపై నిర్భయ యాక్ట్ కింద నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి,   అరెస్టు చేశారు. 354 నిర్భయ యాక్ట్, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టులో వినయ్ వర్మను ఈరోజు హాజరుపరిచారు. కాగా, నటన నేర్చుకోవాలంటే విద్యార్థులు తన ముందు నగ్నంగా నిలబడాలని వినయ్ వర్మ షరతు విధించినట్టు ఆరోపణలు. ఈ మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఆరోపణలు నిజమేనని తేల్చారు.

More Telugu News