kodi kathi: జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స

  • నిన్న రాత్రి 10 గంటల తర్వాత అస్వస్థతకు గురైన శ్రీనివాస్
  • రాజమండ్రి జిల్లా ఆసుపత్రికి తరలింపు
  • సాయంత్రం కాకినాడ ఆసుపత్రికి తరలించే అవకాశం

విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు. అతను మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయితే, ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.

నిన్న రాత్రి పది గంటల తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి పోలీసులు కానీ, వైద్యం అందిస్తున్న డాక్టర్లు కానీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడం లేదు.  ఈ సాయంత్రానికి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోతే... అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీల కోసం ఆసుపత్రి ఉంది. సాధారణ రోగాలకు అక్కడే వైద్యం అందిస్తుంటారు. సీరియస్ గా ఉన్న ఖైదీలను మాత్రమే జిల్లా ఆసుపత్రికి తరలిస్తారు.

More Telugu News