AP planing commission: ఆ మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కావు...క్షమాపణ కోరుతున్నా : కుటుంబరావు

  • గ్రామీణ ప్రాంత భాష ఉపయోగించానంతే
  • ఏ సామాజిక వర్గాన్ని కించపరచాలని కాదు
  • వైసీపీ నాయకులనుద్దేశించి అన్న మాటలపై వివరణ
వైసీపీ నాయకులను ఉద్దేశించి నేను అన్న మాటలు గ్రామీణ ప్రాంత భాష వాడడం  వల్ల వచ్చినవే తప్ప ఏ సామాజిక వర్గాన్ని కించపరచాలన్న ఉద్దేశంతో చేసినవి కావని ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు అన్నారు. నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులనుద్దేశించి అన్న మాటలకు ఆయన బహిరంగంగా క్షమాపణ కోరారు. వైసీపీ అధినేతకు భజన పరులుగా వ్యవహరిస్తున్నారన్న ఉద్దేశంతోనే తానీ వ్యాఖ్యలు చేశాను తప్ప, ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కాదన్నారు. నా మాటలు ఒక సామాజిక వర్గం వారికి మనస్తాపం కలిగిస్తే క్షమించాలని కోరుతున్నానని చెప్పారు.

AP planing commission
kutumbarao
YSRCP
apology

More Telugu News