nani: నిర్మాతగా నాని నుంచి మరో చిత్రం

  • నిర్మాతగా తొలి చిత్రం 'అ!'
  • రెండవ చిత్రానికి సన్నాహాలు
  •  దర్శకుడిగా అనుదీప్ పరిచయం  

కొత్తదనం వున్న కథలను .. పాత్రలను ఎంచుకుంటూ నాని దూసుకుపోతున్నాడు. తన దగ్గరికి మంచి కథలు వస్తే, ఓ మాదిరి బడ్జెట్ లో వాటిని నిర్మించడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. అలా కొంతకాలం క్రితం ఆయన 'అ!' సినిమాను నిర్మించాడు. ఈ సినిమా వలన ఆయనకి పెద్దగా లాభాలు రాకపోయినా, వైవిధ్యభరిత చిత్రంగా ప్రశంసలు అందుకుంది.

నిర్మాతగా కాస్త గ్యాప్ తీసుకున్న నాని, మళ్లీ ఇప్పుడు మరో సినిమాను రూపొందించడానికి రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. కామెడీ కంటెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా ద్వారా అనుదీప్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. నవీన్ .. షాలినీ పాండే .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. రీసెంట్ గా 'జెర్సీ' సినిమాతో హిట్ కొట్టిన నాని, నిర్మాతగా తాజా ప్రాజెక్టుతోను హిట్ కొడతాడేమో చూడాలి. 

More Telugu News