batla house encounter: సోనియాగాంధీ ఏడ్వడాన్ని అమిత్ షా చూశారేమో కానీ, నేను మాత్రం చూడలేదు: సల్మాన్ ఖుర్షీద్

  • 2008లో ఢిల్లీలో చోటు చేసుకున్న బాట్లా హౌస్ ఎన్ కౌంటర్
  • ఉగ్రవాదులు చనిపోతే సోనియా కంటతడి పెట్టారన్న అమిత్ షా
  • త్వరలోనే అమిత్ షా ఏడ్వాల్సి ఉంటుందన్న ఖుర్షీద్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు. బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో టెర్రరిస్టులు హతమవడంతో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఏడ్చారని... కానీ, అదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కోసం ఆమె కంటతడి పెట్టలేదంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఖుర్షీద్ విమర్శలు గుప్పించారు.

సోనియా ఏడ్వడాన్ని అమిత్ షా చూశారేమో కానీ, తాను మాత్రం చూడలేదని ఖుర్షీద్ ఎద్దేవా చేశారు. ఒకవేళ సోనియా ఏడ్చారని అమిత్ షా అనుకుంటే... త్వరలోనే ఆయన కూడా ఏడవాల్సి ఉంటుందని చెప్పారు.

2008 సెప్టెంబర్ 19న ఢిల్లీలోని జామియా నగర్ లో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన అతిఫ్ అమీన్, మొహమ్మద్ సాజిద్ లను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు మొహమ్మద్ సైఫ్, జీషన్ లను అరెస్ట్ చేశారు.  

More Telugu News