Sri Lanka: శ్రీలంక ఘటన నేపథ్యంలో.. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

  • ఏ చిన్న ఘటననూ తేలికగా తీసుకోవద్దు
  • భారత నౌకాదళం, కోస్ట్‌గార్డులు జాగ్రత్తగా ఉండాలి
  • గస్తీని ముమ్మరం చేయాలి
భారత నౌకాదళం, కోస్ట్‌గార్డులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ చిన్న ఘటనను తేలిగ్గా తీసుకోవద్దని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిఘా వర్గాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, నౌకాదళం, కోస్ట్‌గార్డ్ దళాలు అప్రమత్తంగా వ్యవహరించాలని, గస్తీని ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది. శ్రీలంకలో దాడికి పాల్పడిన ముష్కరులు సముద్ర మార్గం ద్వారా దేశంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
Sri Lanka
Coast Guards
South India
Sea
Bomb Blasts

More Telugu News