Chandrababu: జీవీఎల్, విజయసాయిల్లో ఒకరు మైకుల ముందు మొరిగితే.. మరొకరు ట్విట్టర్‌లో మొరుగుతారు: బుద్ధా వెంకన్న

  • జీవీఎల్‌కు చెప్పుతో కొట్టినా బుద్ధి రాలేదు
  • చంద్రబాబు శిఖండిలతో ఎలా యుద్ధం చేస్తారు?
  • శిఖండిలపై భీష్ముడైన చంద్రబాబు బాణం వేయరు
ప్రధాన మంత్రితో యుద్ధం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిఖండిలతో ఎలా యుద్ధం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును కురుక్షేత్రంలో భీష్ముడిలా అభివర్ణించారు. ఏపీలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి శిఖండిలా తయారయ్యారన్నారు.

అలాంటి శిఖండిలపై భీష్ముడైన చంద్రబాబు బాణం వేయరన్నారు. జీవీఎల్‌కు చెప్పుతో కొట్టినా బుద్ధి రాలేదని, మళ్లీ మైకుల ముందు మొరుగుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. జీవీఎల్, విజయసాయి ఒకరు మైకుల ముందు మొరిగితే, మరొకరు ట్విట్టర్‌లో మొరుగుతారని వ్యాఖ్యానించారు. ఇద్దరూ ప్రజల ముందుకు రావడం కానీ, ప్రజా సమస్యలపై పోరాడటం కానీ చేయరని వెంకన్న విమర్శించారు.
Chandrababu
Budha Venkanna
Vijayasai Reddy
GVL Narasimha Rao
Bheeshma

More Telugu News