East Godavari District: మలికిపురంలోని ఓ థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం

  • ఫర్నీచర్ ధ్వంసం
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
  • షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురంలో ఓ థియేటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో థియేటర్ ఖాళీగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. నేడు స్థానిక పద్మజ థియేటర్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడటంతో ఫర్నీచర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 
East Godavari District
padmaja Theator
Rajahmundry
Furniture
Fire Fighters

More Telugu News