chaitu: ప్రపంచవ్యాప్తంగా 'మజిలీ' 17 రోజుల వసూళ్లు

  • విభిన్న ప్రేమకథా చిత్రంగా 'మజిలీ'
  • గట్టిపోటీగా నిలిచిన 'జెర్సీ' .. 'కాంచన 3'
  • ఏ సెంటర్స్ లో తగ్గని దూకుడు    

శివ నిర్వాణ దర్శకత్వంలో విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా 'మజిలీ' నిర్మితమైంది. నాగచైతన్య .. సమంత .. దివ్యాన్ష ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్లపరంగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను దూసుకుపోతోంది.

17 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 35.57 కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక వైపున 'జెర్సీ' .. మరో వైపున 'కాంచన 3' థియేటర్స్ లోకి వచ్చినా, 'మజిలీ' ఇంకా ఏ సెంటర్స్ లో తన జోరును చూపిస్తూ ఉండటం విశేషం. చైతూ .. సమంత ఇద్దరూ కూడా ఈ సక్సెస్ ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

More Telugu News