raj tarun: దిల్ రాజు నుంచి మరో ప్రేమకథా చిత్రం

  • రాజ్ తరుణ్ హీరోగా లవ్ స్టోరీ 
  • దర్శకుడిగా జీఆర్ కృష్ణ 
  • సంగీత దర్శకుడిగా మిక్కీ.జె మేయర్    

కెరియర్ ఆరంభంలోనే రాజ్ తరుణ్ వరుస సినిమాలను .. విజయాలను అందుకున్నాడు. ఆ తరువాత ఆయనను వరుస పరాజయాలు పలకరించడం మొదలైంది. ఒక వైపున యువ కథానాయకుల నుంచి గట్టిపోటీ .. మరో వైపున పరాజయాలతో రాజ్ తరుణ్ సతమతమైపోయాడు. ఈ కారణంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఈ మధ్య కాలంలో ఆయనకి సంబంధించిన ప్రాజెక్టు ఏ ఒక్కటీ పట్టాలెక్కలేదు.

 దిల్ రాజు నిర్మాణంలో మాత్రం ఒక సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ రోజు ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. 'ఇద్దరి లోకం ఒకటే' టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి జి.ఆర్. కృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ సినిమా స్క్రిప్ట్ ను రచయిత విజయేంద్రప్రసాద్ .. దర్శకుడు కృష్ణకి అందజేశారు. అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్న ఈ సినిమాకి. మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News