congress: ఢిల్లీలో 7 స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. జాబితాలో లేని కపిల్ సిబల్ పేరు!

  • ఈశాన్య ఢిల్లీ నుంచి షీలా దీక్షిత్
  • కొత్త ఢిల్లీ బరిలో అజయ్ మాకెన్
  • మరో స్థానాన్ని రమేశ్ కుమార్ కు కేటాయించే అవకాశం

ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ ల మధ్య పొత్తు కుదరలేదు. ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేయనున్నారు. ఢిల్లీలోని 7 పార్లమెంటు స్థానాలకు గాను ఆరుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు వీరే.

  • చాందినీచౌక్ - జేపీ అగర్వాల్
  • ఈశాన్య ఢిల్లీ - షీలా దీక్షిత్
  • తూర్పు ఢిల్లీ - అర్విందర్ సింగ్ లవ్లీ
  • కొత్త ఢిల్లీ - అజయ్ మాకెన్
  • వాయవ్య ఢిల్లీ - రాజేష్ లిలోతియా
  • పశ్చిమ ఢిల్లీ - మహాబల్ మిశ్రా

పై అభ్యర్థుల్లో షీలా దీక్షిత్ మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశారు. పోటీ చేయాలనుకుంటున్న స్థానాన్ని నిర్ణయించుకునే అవకాశాన్ని షీలా దీక్షిత్ కే వదిలివేయగా... తూర్పు ఢిల్లీని కాదని ఈశాన్య ఢిల్లీని ఆమె ఎంపిక చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పేరు అభ్యర్థుల జాబితాలో లేకపోవడం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల ముక్కోణపు పోటీలో బరిలోకి దిగడానికి ఆయన ఆసక్తిని చూపనట్టు తెలుస్తోంది. ఇతరులకు సీట్ల కేటాయింపులు కూడా మరొక కారణం అయి ఉండవచ్చని సమాచారం.

ఏడు స్థానాల్లో మరొక స్థానానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాన్ని రమేశ్ కుమార్ కు కేటాయించే అవకాశం ఉంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితుడు సజ్జన్ కుమార్ సోదరుడే రమేశ్ కుమార్.


More Telugu News