anchor: మందు కొట్టి రచ్చ చేసిన యాంకర్ ప్రశాంతి.. కేసు నమోదు

  • ఉప్పల్ స్టేడియంలో ప్రశాంతి హల్ చల్
  • తప్పతాగి ఇబ్బందికరంగా ప్రవర్తించిన వైనం
  • కాసేపట్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్న ప్రశాంతి
ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన హైదరాబాద్-కోల్ కతా మ్యాచ్ సందర్భంగా టీవీ యాంకర్ ప్రశాంతి రచ్చరచ్చ చేసింది. తన స్నేహితులు ప్రియ, పూర్ణిమ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్ లతో కలసి మ్యాచ్ చూసేందుకు ఆమె వచ్చింది. ఈ సందర్భంగా తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగేలా వారు ప్రవర్తించారు. సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో ప్రశాంతి అసభ్యకరంగా ప్రవర్తించింది. వీరి చేష్టలతో అసహనానికి లోనైన ఓ వీక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఫూటేజిని పరిశీలించిన పోలీసులు ప్రశాంతిపై కేసు నమోదు చేశారు. కాసేపట్లో ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరణ ఇవ్వనున్నట్టు సమాచారం.
anchor
prashanthi
druck
uppal stadium
case

More Telugu News