allu shirish: 'ఏబీసీడీ' నుంచి కుర్రాళ్ల ఆశలకి అద్దంపట్టే పాట

  • మలయాళ మూవీకి రీమేక్ గా 'ఏబీసీడీ'
  • ముఖ్యమైన పాత్రలో భరత్
  •  మే 17వ తేదీన విడుదల

సంజీవ్ దర్శకత్వంలో అల్లు శిరీశ్ 'ఏబీసీడీ' అనే సినిమా చేశాడు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన హిట్ చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలో అల్లు శిరీశ్ స్నేహితుడిగా పూర్తిస్థాయి పాత్రలో భరత్ నటించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు.

"అమెరికా నా అమెరికా నిను మిస్సవుతున్నా బాగా .. స్లమ్ములో ఈ దుమ్ములో నా ఫ్యూచర్ అర్థం కాక .. బ్యాడ్ టైమే నన్ను బ్యాటుతోటి కొడితే .. డెస్టినీ ఎగిరెళ్లి డస్టుబిన్ లో దూకిందే .. " అంటూ ఈ పాట సాగుతోంది. జుదా శాండీ సంగీతం .. భాస్కర్ భట్ల సాహిత్యం .. బెన్నీ దయాళ్ - సంజిత్ హెగ్డే ఆలాపన యూత్ కి కనెక్ట్ అయ్యేలా వున్నాయి. తమ ఆశలకు .. సరదాలకు పరిస్థితులు అడ్డంకిగా మారితే కుర్రాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ పాటలో ఆవిష్కరించారు. రుక్సర్ థిల్లోన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, మే 17వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News