Sri Lanka: శ్రీలంక పేలుళ్ల ఘటనలో 290కి చేరిన మృతుల సంఖ్య

  • గాయపడిన వారి సంఖ్య 500 లు పైమాటే
  • 24 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశవ్యాప్తంగా కర్ప్యూ ఎత్తివేత  

శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య  నేటి ఉదయానికి 290కి చేరిందని అధికారులు అంచనా వేశారు. మరో 500 మంది గాయపడిన వారున్నారు. క్షతగాత్రులు అధిక సంఖ్యలో ఉండడంతో మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో మొత్తం 32 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో ఐదుగురు భారతీయులని శ్రీలంకలోని భారత్‌ హైకమిషనర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. నిన్న సాయంత్రానికి రమేష్‌, లక్ష్మి, నారాయణ చంద్రశేఖర్‌ అనే వ్యక్తులు చనిపోయినట్లు వెల్లడించిన అధికారులు హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప అనే ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయినట్లు ఈరోజు తెలిపారు.

ఇప్పటివరకు ఈ దాడులతో సంబంధం ఉన్న మొత్తం 24 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు అధికారులు మరిన్ని పేలుడు ఘటనలకు ఆస్కారం ఉందన్న ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండి తనిఖీలు జరుపుతున్నారు. తాజాగా శ్రీలంక  విమానాశ్రయం ప్రాంతంలో అమర్చిన ఓ పైపు బాంబును నిర్వీర్యం చేశారు. నిన్న ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లతో దేశవ్యాప్తంగా కర్య్పూ విధించిన ప్రభుత్వం దాన్ని ఎత్తివేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది.

More Telugu News