Hyderabad: హైదరాబాద్ బీజేపీ నగర ఉపాధ్యక్షుడిపై స్క్రూ డ్రైవర్‌తో దాడి.. 20 సార్లు పొడిచిన ఆగంతుకుడు

  • అరుణ్‌కుమార్‌ను పొడిచి పరారైన అభిమన్యు
  • అపోలో ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • అరుణ్ కుమార్-అభిమన్యు సంబంధం వెనక పోలీసుల ఆరా
హైదరాబాద్ బీజేపీ నగర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్‌పై ఆదివారం రాత్రి దాడి జరిగింది. అభిమన్యు అనే వ్యక్తి స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచాడు. దాదాపు 20 సార్లు పొడవడంతో అరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఫిలింనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన అరుణ్‌ను వెంటనే సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

దాడికి పాల్పడిన అభిమన్యు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అభిమన్యు ఎవరు? ఇద్దరి మధ్య ఏవైనా పాతకక్షలు ఉన్నాయా? లేదంటే ఎవరైనా అభిమన్యుతో ఈ పనిచేయించి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అభిమన్యు కోసం వేట ప్రారంభించారు.
Hyderabad
BJP
Aurn kumar
Abhimanyu
Telangana

More Telugu News