Sri Lanka: శ్రీలంకలో చిక్కుకుపోయిన అనంతపురం వాసులు!

  • ఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత సురేంద్రబాబుకు గాయం
  • మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సురేంద్రబాబు
  • హోటల్ గదిలోనే ఉండిపోయిన పాస్ పోర్టులు, ఇతర పత్రాలు 
శ్రీలంక రాజధాని కొలంబో బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ పేలుళ్లలో ఏపీలోని అనంతపురానికి చెందిన ఎస్ ఆర్ కన్ స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు స్వల్ప గాయమైంది. సురేంద్రబాబు తన నలుగురు స్నేహితులతో కలిసి కొలంబోకు విహారయాత్రకు వెళ్లారు. హోటల్ షాంగ్రిలాలో బస చేశారు.

 అయితే, ఈ హోటల్ కు సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడు జరిగిన సమయంలో వారు ఆ హోటల్ లో అల్పాహారం తీసుకుంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పర్యాటకులు ఆందోళన చెందవద్దంటూ హోటల్ సిబ్బంది మైక్ ద్వారా ఓ ప్రకటన చేసింది. అయినప్పటికీ, పర్యాటకులు హోటల్ నుంచి బయటపడేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో అమిలినేని సురేంద్రబాబుకు స్వల్ప గాయమైంది. సురేంద్రబాబు సహా ఆయన స్నేహితుల పాస్ పోర్టులు, ఇతర పత్రాలు హోటల్ గదిలోనే ఉండిపోయినట్టు సమాచారం.
Sri Lanka
Colombo
Ananthapuram
hotel
shangrila
sr constructions
surendra babu

More Telugu News