chattisgargh: ఛత్తీస్ గఢ్ అడవుల్లో గర్జించిన తుపాకులు.. ఇద్దరు మావోయిస్టుల కాల్చివేత!

  • పామేడ్ అడవుల్లో మావోలు ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం
  • గ్రేహౌండ్స్, ఛత్తీస్ గఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
  • భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో ఈరోజు మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇధ్దరు మావోయిస్టులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. బీజాపూర్ జిల్లా పామేడ్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు నిఘావర్గాలు సమాచారం అందించాయి., దీంతో తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్ బలగాలు, ఛత్తీస్ గఢ్ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.

పామేడ్ అడవుల్లో బలగాల కదలికలను పసిగట్టిన మావోలు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు చనిపోగా, ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశారు.

More Telugu News