Abhinandan: మరో సెక్టార్ కు బదిలీ అయిన వింగ్ కమాండర్ అభినందన్‌!

  • ఇన్నాళ్లూ శ్రీనగర్ ఎయిర్ బేస్ లో బాధ్యతలు 
  • భద్రతా కారణాల రీత్యా వెస్ట్రన్ సెక్టార్‌కు అభినందన్
  • మళ్లీ విధుల్లో చేరనున్న వింగ్ కమాండర్
వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో ఇప్పటి వరకూ అభినందన్ విధులు నిర్వహించారు. అయితే తాజాగా ఆయనను వెస్ట్రన్ సెక్టార్‌కు భద్రతా కారణాల రీత్యా బదిలీ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని వారాలుగా చికిత్స తీసుకుంటున్న అభినందన్ మళ్లీ విధుల్లోకి చేరనున్నారని ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని పరీక్షల అనంతరం అభినందన్ విధుల్లో చేరనున్నట్టు తెలుస్తోంది.  
Abhinandan
Indian Airforce
Srinagar
Western Sector

More Telugu News