Andhra Pradesh: మంగళగిరిలో లోకేశ్ గెలుపు కోసం చంద్రబాబు చాలా అక్రమాలు చేశారు!: ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేశారు
  • బాబుకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది
  • గుంటూరులో మీడియాతో వైసీపీ నేత

గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ గెలుపు కోసం సీఎం చంద్రబాబు చాలా అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కోట్లాది రూపాయలను నియోజకవర్గంలో మంచినీళ్లలా ఖర్చు చేశారని ఆరోపించారు. ఏపీలో అర్ధరాత్రి వరకూ ఓటింగ్ జరిగినా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు వైసీపీ కార్యాలయంలో ఆళ్ల మీడియాతో మాట్లాడారు.

ఏపీలో పోలింగ్ శాతం భారీగా పెరిగిందనీ, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. అందులో భాగంగానే వైసీపీ నేతలపై ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఏం చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఏపీలో మే 23 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News