ec: ఇంత పనికిమాలిన ఈసీని జీవితంలో చూడలేదు: వర్ల

  • కేసీఆర్ సమీక్షలను ఈసీ పట్టించుకోవడం లేదు
  • చంద్రబాబు సమీక్షలనే పట్టించుకుంటున్నారు
  • ద్వివేది పంతాలను వదిలేయాలి
ఎన్నికల సంఘంపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఇంత పనికిమాలిన ఈసీని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షలు చేస్తుంటే పట్టించుకోని ఈసీ... ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షలను మాత్రమే ఎందుకు పట్టించుకుంటోందని దుయ్యబట్టారు. టీడీపీ తరపున 157 ఫిర్యాదులు చేస్తే... ఒక్కదాన్ని కూడా ఈసీ పట్టించుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది పంతాలను వదిలేయాలని... సమీక్షలు నిర్వహించుకోమని చెప్పాలని అన్నారు.
ec
dwivedi
varla
Chandrababu
kct
TRS
Telugudesam

More Telugu News