Andhra Pradesh: వైసీపీ నేతలు అప్పుడే పొంగిపోతున్నారు.. పోర్టుఫోలియోలు కూడా పంచుకుంటున్నారు!: సాధినేని యామిని వ్యంగ్యం

  • ఏపీ ద్రోహుల కాంట్రాక్టు ఈ నెల 11తో ముగిసింది
  • ఎన్ని కుట్రలు చేసినా టీడీపీదే అధికారం
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లు పొంగిపోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. అక్కడితో ఆగకుండా పోర్టుఫోలియోలు పంచుకోవడం ఇంకా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సాధినేని యామిని మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ద్రోహుల కాంట్రాక్టు ఈ నెల 11న పోలింగ్ తర్వాత ముగిసిపోయిందని దుయ్యబట్టారు. ఎన్నికల సందర్భంగా ప్రతీసారి మోదీ ఓ కొత్త నినాదంతో వస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ప్రతీసారి ప్రజలను ఆయన మోసం చేస్తున్నారని యామిని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh
YSRCP
Telugudesam
sadhineni yamini
amaravati

More Telugu News