Hyderabad: హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు.. ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు!

  • మైలార్ దేవ్ పల్లి ప్రాంతంలో పలు ఇళ్లలో తనిఖీలు
  • ఉగ్రవాది బాసిత్, నిఘావర్గాల సమాచారంతో అప్రమత్తత
  • ఎన్ఐఏ కార్యాలయానికి తహాన్ అనే యువకుడి తరలింపు

హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు తహాన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ సానుభూతిపరుడిగా ఉన్న తహాన్ ను ఎన్ఐఏ అధికారులు పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతనిని హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. ఇతను గత నాలుగు నెలలుగా ఇక్కడి కింగ్స్ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న నిఘావర్గాల హెచ్చరికతో పాటు ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News