Sangareddy District: రెండో భార్య, ఆమె కొడుకుపై భర్త దాడి.. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య

  • తీవ్రంగా గాయపడిన ఎనిమిదేళ్ల కొడుకు మృతి
  • భార్యకు తీవ్రగాయాలు
  • సంగారెడ్డి జిల్లాలో దారుణం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో దారుణం జరిగింది. సుబ్బరాజు అనే వ్యక్తి తన రెండో భార్య లక్ష్మి పైనా, ఆమెకు మొదటి భర్త ద్వారా పుట్టిన కొడుకు చైతన్యపైన కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో లక్ష్మి కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం తనూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబ్బరాజు రెండు నెలల క్రితమే లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News