mano: హోటల్లో పాడితే నెలకి 120 రూపాయలు ఇచ్చేవారు: సింగర్ మనో

  • చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ పెరిగాను
  •  కుటుంబానికి అండగా నిలిచేందుకు చెన్నై వెళ్లాను
  •  ఆర్ధికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటాను  

తెలుగు .. తమిళ భాషల్లో గాయకుడిగా 'మనో'కి మంచి పేరుంది. ఆయన పాడిన ఎన్నో పాటలు ఇప్పటికీ హుషారెత్తిస్తూనే ఉంటాయి. అలాంటి 'మనో' సినీ గాయకుడిగా ఎదగడానికి ముందు తన పరిస్థితిని గురించి చెప్పుకొచ్చారు. "కుటుంబం గడపడానికి మా అమ్మానాన్నలు ఎంతగా కష్టపడేవారో చూస్తూ పెరిగాను. నా కాళ్లపై నేను నిలబడి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో చెన్నైకి వెళ్లాను.

నాకు తెలిసిన పని పాడటమే. ఒక హోటల్లో వారానికి ఒకరోజు పాటలు పాడేవాడిని. ఒక రోజుకి 30 రూపాయల చొప్పున నాలుగు రోజులకి కలిపి, నెల కాగానే 120 రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బుతోనే అద్దె కట్టుకుని .. నన్ను నేను పోషించుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడిని. అప్పుడు అన్ని కష్టాలు పడినా .. ఎందుకనో అవి పెద్ద కష్టాలుగా అనిపించలేదు. కష్టమనేది అనుభవంలోకి వచ్చింది కనుక, ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తపడటం నేర్చుకున్నాను. అదే నన్ను కాపాడుతూ వస్తోంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News