Andhra Pradesh: పేదల గుండెల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేసుకున్నారు!: ప్రత్తిపాటి పుల్లారావు

  • చిలకలూరిపేటలో బాబు పుట్టినరోజు వేడుకలు
  • కేక్ కట్ చేసిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
  • మళ్లీ టీడీపీయే అధికారంలోకి రాబోతోందని జోస్యం
ఆంధ్రప్రదేశ్ లోని పేదల గుండెల్లో చంద్రబాబు చెరగని ముద్ర వేసుకున్నారని ఏపీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏపీని అభివృద్ధి పథంలో నడపాలంటే అది చంద్రబాబు వల్లే సాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ అధినేత అహర్నిశలు శ్రమిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

ఈరోజు గుంటూరులోని చిలకలూరిపేట టీడీపీ ఆఫీసులో సీబీఎన్ ఆర్మీ, కార్యకర్తల సమక్షంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కేక్ కట్ చేశారు. అనంతరం చంద్రబాబుకు ప్రత్తిపాటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
prattipati
pullarao
Chandrababu
Telugudesam

More Telugu News