anupama: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సినిమాల ద్వారా ఎంతో నేర్చుకుందట!
  • కేరళ అడవులలో చిరంజీవి షూటింగ్ 
  • తెలుగు డైరెక్టర్ హిందీ చిత్రం

*  డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో మాత్రమే తాను సినిమాల్లోకి రాలేదు అంటోంది అందాలభామ అనుపమ పరమేశ్వరన్. 'సినిమా ఇండస్ట్రీ అనేది ఓ పెద్ద స్కూలు లాంటిది. ఇక్కడ ఎంతో నేర్చుకోవచ్చు. బయటి ప్రపంచంలో ఎదురవ్వని వ్యక్తులు.. సందర్భాలు.. సంఘటనలు ఇక్కడ మనకు తారసపడతాయి. దీంతో ఈ అనుభవాల నుంచి మనకు తెలియకుండానే ఎంతో నేర్చుకుంటాం. నేను కూడా అలాగే నేర్చుకుంటున్నాను' అని చెప్పింది అనుపమ.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం కేరళలోని అడవులలో జరుగుతోంది. చిరంజీవితో పాటు బ్రహ్మాజీ, చరణ్ దీప్ తదితరులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ పది రోజుల పాటు సాగుతుంది.
*  ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి రూపొందించిన హిందీ చిత్రం 'మెంటల్ హై క్యా' షూటింగ్ పూర్తయింది. కంగన, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తారు.

More Telugu News