Tripoli: లిబియా నుంచి తక్షణమే వచ్చేయండి.. భారతీయులకు విదేశాంగశాఖ సూచన

  • రోజురోజుకూ క్షీణిస్తున్న పరిస్థితులు
  • ఇప్పటి వరకూ 200 మంది మృతి
  • ఆందోళన వ్యక్తం చేసిన యూఎన్‌ఓ

ప్రస్తుతం లిబియాలో ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఇక్కడి పరిస్థితులపై యూఎన్ఓ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 200 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో లిబియాలో నివసిస్తున్న భారతీయులంతా తక్షణమే భారత్‌కు తిరిగి వచ్చేయాలని విదేశాంగశాఖ సూచించింది.

500 మందికి పైగా భారతీయులు లిబియా రాజధాని ట్రిపోలీలో ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ట్రిపోలి నుంచి విమానాలను నడుపుతున్నామని, ఆ తరువాత భారతీయులను అక్కడి నుంచి తీసుకురావడం కష్టమవుతుందని, కాబట్టి తక్షణమే లిబియాను వీడాలని తెలిపింది.

More Telugu News