Madhu Pathar: ఇంజినీరింగ్ విద్యార్థిని మధుని దారుణంగా హత్య చేశారు.. ఈ ఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది: రష్మిక

  • మానవత్వం ఎక్కడ?
  • ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయి?
  • మధుకు న్యాయం జరగాలి
  • దీనికి ఓ ముగింపు ఉండాలి
రాయచూరు నవోదయ ఇంజినీరింగ్ విద్యార్థిని మధుపత్తార్‌పై కొందరు అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారని పోలీసులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆమెతో బలవంతంగా సూసైడ్ నోట్ కూడా రాయించారని వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై కథానాయిక రష్మిక, సింగర్ చిన్మయి స్పందించారు.

‘మానవత్వం ఎక్కడ? రాయచూర్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని మధు అత్యాచారానికి గురైంది, ఆమెను దారణంగా హత్య చేశారు. నిజంగా ఈ సంఘటన నా హృదయాన్ని బద్దలు చేసింది. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయి? మధుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. దీనికి ఓ ముగింపు ఉండాలి’ అని రష్మిక ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

తమ కుమార్తె కనిపించడం లేదంటూ మధుపత్తార్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి, పరిస్థితిని సీరియస్‌గా తీసుకుని మధు కోసం గాలించి ఉండాల్సిందని చిన్మయి అభిప్రాయపడింది.
Madhu Pathar
Rashmika
Chinmayi
Rayachur
Engeneering Student
Police

More Telugu News