New Delhi: ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ శేఖర్ మృతి కేసును హత్యగా తేల్చిన పోలీసులు

  • పోస్టుమార్టంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి
  • ఊపిరి ఆడకుండా చేసి చంపారు
  • దిండుతో నొక్కిపట్టారు

దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్ కొన్నిరోజుల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, పోస్టుమార్టం అనంతరం దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. రోహిత్ శర్మ మరణాన్ని పోలీసులు హత్యగా తేల్చారు. దిండుతో నొక్కిపెట్టి, ఊపిరి ఆడకుండా చేయడం వల్లనే రోహిత్ శేఖర్ ప్రాణాలు విడిచాడని తెలుసుకున్నారు.

అంతకుముందు, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం అయిన స్థితిలో ఇంట్లో పనివాళ్లు చూసి రోహిత్ ను ఆసుపత్రికి తరలించారు. తన గదిలో నిద్రిస్తున్న రోహిత్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడని భార్య అపూర్వ చెప్పింది. వీళ్లిద్దరికీ కిందటేడాదే పెళ్లయింది. అయితే, పోస్టుమార్టం తర్వాత రోహిత్ శేఖర్ మరణం సహజమరణం కాదని వెల్లడైంది. దాంతో, ఈ వ్యవహారాన్ని హత్య కేసుగా నమోదుచేయడమే కాకుండా, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు.

కేసు టేకప్ చేసిన క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఇవాళ రోహిత్ శేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను, ఇంట్లో పనివాళ్లను ప్రశ్నించారు. కాగా, రోహిత్ నివాసంలో 7 సీసీటీవీ కెమెరాలు ఉన్నా, సంఘటన జరిగిన సమయంలో 2 కెమెరాలు పనిచేయలేదని తెలుస్తోంది. పోలీసులు ఈ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ శేఖర్ సుదీర్ఘకాలం న్యాయపోరాటం తర్వాత తాను ఎన్డీ తివారీ కుమారుడ్నని అధికారంగా నిరూపించుకున్న సంగతి తెలిసిందే .

More Telugu News