devegowda: ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి మళ్లీ పోటీ చేయడానికి కారణం ఇదే: దేవెగౌడ

  • మారిన పరిస్థితుల్లో పోటీ చేయక తప్పలేదు
  • రాహుల్ ను ప్రధాని చేయడమే నా లక్ష్యం
  • అద్వానీలా రాజకీయాల నుంచి తప్పుకోను
ఇకపై తాను పోటీ చేయబోనని మూడేళ్ల క్రితం మాజీ ప్రధాని దేవెగౌడ చెప్పారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆయన మళ్లీ బరిలోకి దిగారు. దీని గురించి మీడియాతో మాట్లాడుతూ, ఆయన వివరణ ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని... ఎన్నికల్లో పోటీ చేయక తప్పలేదని ఆయన అన్నారు. అందరి కోరిక మేరకే పోటీ చేశానని... ఇందులో దాయాల్సిన విషయం ఏమీ లేదని చెప్పారు. పదవులపై తనకు వ్యామోహం లేదని... ప్రధాని కావాలని కూడా అనుకోలేదని అన్నారు. తన పార్టీని కాపాడుకోవడం, ప్రజలకు సేవ చేయడమే తనకు ముఖ్యమని చెప్పారు.

తమది చిన్న పార్టీనే అయినప్పటికీ... తాను ప్రధాని కావడానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ సహకరించారని దేవెగౌడ తెలిపారు. ఇప్పుడు రాహుల్ ను ప్రధాని చేయడం తన బాధ్యత అని చెప్పారు. రాహుల్ ప్రధాని అయితే ఆయన పక్కన కూర్చుంటానని అన్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీలా తాను రాజకీయాల నుంచి తప్పుకోబోనని చెప్పారు.
devegowda
rahul gandhi
Sonia Gandhi
advani

More Telugu News