allu arjuhn: అల్లు అర్జున్ తండ్రి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు

  • అల్లు అర్జున్ తల్లి పాత్రలో 'టబు'
  • తండ్రి పాత్రలో జయరామ్
  •  పరిశీలనలో రెండు టైటిల్స్
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాతో పూజా హెగ్డే మరోసారి అల్లు అర్జున్ తో జోడీ కడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో 'టబు' ను తీసుకున్నారు.

ఇక తండ్రి పాత్ర కూడా చాలా ప్రాధాన్యత కలిగినదే. అందువల్లనే ఈ పాత్ర కోసం సీనియర్ హీరోల పేర్లను పరిశీలించి, మలయాళ నటుడు 'జయరామ్' ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మలయాళంలో జయరామ్ కి మంచి క్రేజ్ వుంది. నటుడిగా సుదీర్ఘకాల ప్రయాణంలో ఆయన చేస్తోన్న తెలుగు సినిమా ఇదే. కొత్తదనం కోసమే ఆయనను తీసుకున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. తల్లి పాత్ర వైపు నుంచి 'అలకనంద' .. తండ్రి పాత్ర వైపు నుంచి 'నాన్న - నేను' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఏ టైటిల్ ను ఖరారు చేస్తారో చూడాలి మరి. 
allu arjuhn
pooja hegde
tabu

More Telugu News