కాలువలో వీవీ ప్యాట్ స్లిప్‌ల అంశంపై ఈసీ సీరియస్...పీఓ, ఏపీఓలపై క్రిమినల్ కేసుల నమోదు
- ఇద్దరినీ ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం
- మొదటి విడత పోలింగ్ తర్వాత బయటపడిన స్లిప్పులు
- వివాదం కావడంతో విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారులు
వివరాల్లోకి వెళితే...మండపేట మండలం మారేడుబాక సమీపంలోని శ్రీసూర్యచంద్ర ఫ్యాక్టరీ సమీపంలోని ఓ కాలువలో గుట్టగా పడివున్న వీవీ ప్యాట్ స్లిప్పులను స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. విషయం మీడియా ప్రతినిధులకు కూడా తెలియడంతో ఈ అంశం వివాదమైంది. ఈ స్లిప్పులు మాక్ పోలింగ్‌వా, అసలైన పోలింగ్‌వా అన్న అంశంపై అధికారులు నోరు విప్పక పోవడంతో మరింత వివాదం నెలకొంది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజా నిర్ణయం తీసుకుంది.