mahesh: మహేశ్ బాబుకి విలన్ గా జగపతిబాబు!

  • విడుదలకి సిద్ధమవుతోన్న 'మహర్షి'
  • తదుపరి ప్రాజెక్టుకి సన్నాహాలు
  •  ముఖ్యమైన పాత్రలో బండ్ల గణేశ్  
మహేశ్ బాబు తాజా చిత్రంగా 'మహర్షి' రూపొందుతోంది. రీసెంట్ గా షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించనున్నాడు. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అందువలన ఈ పాత్రకోసం జగపతిబాబు అయితే బాగుంటాడని భావించి ఆయనని సంప్రదించడం .. ఆయన అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. 'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్ బాబుకి తండ్రిగా నటించి మంచి మార్కులు కొట్టేసిన జగపతిబాబు, మహేశ్ బాబుతో తలపడే విలన్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఇక అనిల్ రావిపూడి రూపొందించే ఈ సినిమాలో బండ్ల గణేశ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడనే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. 
mahesh
pooja hegde

More Telugu News