Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ దంపతులు

  • ఈరోజు తెల్లవారు జామున స్వామి సన్నిధికి
  • అభిషేక సేవలో పాల్గొన్న జస్టిస్‌ గొగోయ్‌ కుటుంబ సభ్యులు
  • రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఈరోజు తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భార్య రూపాంజలి గొగోయ్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తెల్లవారు జామున ఆకాశగంగ జలాలతో నిర్వహించే అభిషేక సేవలో పాల్గొన్నారు.

న్యాయమూర్తికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈఓ శ్రీనివాసరావు, అర్చకుడు డాలర్‌ శేషాద్రి ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అభిషేక సేవ అనంతరం స్వామి వారి హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు గొగోయ్‌ దంపతులకు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు.
Tirumala
abhisheka seva
justice ranjan gogoi

More Telugu News