YS Vijayamma: మమతల తల్లీ... శుభాకాంక్షలు: వైఎస్ షర్మిల

  • నేడు విజయమ్మ పుట్టినరోజు
  • నాన్నకు అర్థాంగిగా నిలిచి తమను పెంచిందన్న షర్మిల
  • అభినందనలు తెలుపుతున్న అభిమానులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పుట్టినరోజు నేడు కాగా, ఆ పార్టీ మహిళా నేత, వైఎస్ జగన్ సోదరి షర్మిల ఫేస్ బుక్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. "నాన్నకు అర్థాంగిగా నిలిచి, ఆప్యాయత అనురాగాలతో మమ్మల్ని పెంచి పెద్ద చేసిన అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆమె తమ మమతల తల్లని పేర్కొన్నారు. తాను, జగన్ కలిసి విజయమ్మతో ఉన్న ఫోటోను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ఇక ఈ పోస్ట్ ను చూసిన వారంతా విజయమ్మకు శుభాభినందనలు తెలుపుతున్నారు.
YS Vijayamma
YSRCP
Sharmila
Birthday

More Telugu News